పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అవతరణ దినోత్సవ వేడుకలు
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పెద చెర్లోపల్లి మండలం పడమటిపల్లి గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంపీడీవో కృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎంపీడీవో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.