సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి
కోనసీమ: రామచంద్రపురం మండలం వెల్లలో జల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యక్రమాన్ని మంత్రి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు ఈ పనులు జరుగుతాయన్నారు. భూగర్భ జలాల పెంపు ద్వారా సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నియోజకవర్గంలో గుర్రపు డెక్క, పూడికతీత పనుల కోసం రూ. 70 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.