'బస్కి పంచాయతీ నిధుల దుర్వినియోగం'
ASR: అరకులోయ మండలం బస్కీ గ్రామపంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం జరిగిందని మాజీ ఎంపీటీసీ బురిడి దశరథ్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన సుమారు రూ. 66.43 లక్షల నిధుల్లో సర్పంచ్ పాడి రమేశ్ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సుమారు రూ. 31.48 లక్షలు దుర్వినియోగం చేశారని ఆయన ఇవాళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.