కనిగిరిలో డ్రైనేజ్ పనుల పరిశీలన
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని 16వ వార్డులో చేపడుతున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్‌తో కలిసి టౌన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.