నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి

TG: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2:25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. డిసెంబర్ 19వ తేదీన రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. 22వ తేదీ వరకు HYDలో ముర్ము ఉండనున్నారు.