ఇందిరమ్మ చీరల పంపిణీ
MBNR: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 22, 43 వార్డులలో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'ఇందిరమ్మ చీరల' పంపిణీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం మాటలు చెప్పడం కాకుండా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ముంగిటకే చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జ్యోతి, వాణిశ్రీ పాల్గొన్నారు.