కర్కశత్వం.. ముళ్లపొదల్లో మగ శిశువు
AP: శ్రీకాకుళం జిల్లా బూరగాం గ్రామంలో పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ మగ శిశువును ముళ్లపొదల్లో వదిలేసిన హృదయ విదారక ఘటన జరిగింది. పసిబిడ్డ ఏడుపు విని గమనించిన ఓ మహిళ గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కన్నవారే భారంగా భావించిన ఆ చిన్నారిని పెంచేందుకు దేవకి అనే మహిళ కుటుంబం ముందుకు రావడంతో మానవత్వం మరోసారి వెల్లివిరిసింది.