పంగులూరులో పారిశుద్ధ్య పనులు
BPT: పంగులూరు మండలం ముప్పవరం గ్రామ పరిధిలోని ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం చాలా కాలంగా పేరుకుపోయిన వ్యర్థాల (లెగసీ వేస్టేజ్)ను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ్లైఓవర్ కింద, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పాత చెత్త వల్ల అటు వాహనదారులకు, ఇటు గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ చర్య చేపట్టారు.