పీలేరులో క్లారిటీ స్కానింగ్ సెంటర్ నిర్లక్ష్యం
అన్నమయ్య: పీలేరు పట్టణంలోని క్లారిటీ స్కానింగ్ సెంటర్ రోగులకు సకాలంలో రిపోర్టులు ఇవ్వక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాలమహానాడు నేత తుమ్మల ధరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత 12 గంటలు గడిచినా రిపోర్ట్ ఇవ్వకపోవడంతో రోగి చికిత్స ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ అనుమతులు రద్దు చేసి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.