శోభాయ మానంగా రససిద్దేశ్వరుడి రథోత్సవం వేడుకలు
E.G: రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగలా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని రథోత్సవంపై కొలువు దీర్చి అనేక భక్తుల నడుమ రథోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రదేశం ఉండే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు