ధాన్యం కొనుగోలు నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నూతన భవనాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. రైతుల సౌకర్యార్థం ఈ నూతన భవనం అందుబాటులో తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల హరిబాబు, అబ్బురి సీతయ్య , బొల్లిన నాగేంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి సిస్తు మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.