VIDEO: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

NGKL: బిజినేపల్లిలోని గాంధీ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతి, వాటి ప్రస్తుత దశ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.