అప్పుల భారం భరించలేక కౌలు రైతు బలవన్మరణం

GNTR: ఫిరంగిపురం కండ్రికలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కౌలు పొలాల్లో మిర్చి, పత్తి సాగు చేసిన గజేంద్ర బాలకృష్ణ(35) నష్టాలతో రూ.20 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో అప్పుల ఒత్తిడితో ఆరు రోజుల క్రితం గడ్డి మందు సేవించారు. అప్పటి నుంచి గుంటూరులో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. బాలకృష్ణకు భార్య విజయలక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.