'గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని సాధించవచ్చు'
JGL: జిల్లా మెట్‌పల్లిలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చక్ర స్పేస్ హై స్కూల్లో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశామన్నారు. ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఇవాళ తెలుసుకున్నామన్నారు. గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు.