'తక్షణమే దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి'

AKP: రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ అన్నారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులకు సంఘీభావం తెలిపారు. పింఛన్ మీద వారి జీవనశైలి ఆధారపడి ఉంటుందన్నారు. తక్షణమే తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలన్నారు.