చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

JGL: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్లు చెక్‌పోస్ట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ రాములు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్, చెక్‌పోస్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.