బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు

బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు

NLR: అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంతో సోమవారం విడవలూరు మండలంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ నినాదాలు చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం సంతోషంగా ఉందన్నారు.