జీవో 60 రద్దు చేయాలని పీడీవోలకు వినతి
E.G: జీవో 60 రద్దు చేయాలని కోరుతూ రాజమండ్రి రూరల్ ఎంపీడీవోకు పంచాయతీ అభివృద్ధి అధికారులు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ పనుల్లో ముందుండే తమపై వివక్ష చూపడం అన్యాయమని మండిపడ్డారు. గ్రేడ్-3 కార్యదర్శుల బాధ్యతలు పెంచి జీతాలు తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.