లారీ, బస్సు ఢీ.. తప్పిన పెను ప్రమాదం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై శనివారం అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.