సత్తెనపల్లిలో సెన్సస్-2027 శిక్షణ ప్రారంభం
PLD: సత్తెనపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం సెన్సస్-2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్ ఈ శిక్షణను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు జనాభా లెక్కల సేకరణ ప్రాముఖ్యత, ప్రాధాన్యతను హాజరైన ఎన్యుమరేటర్లకు వివరించారు. సర్వే ఉద్దేశాన్ని తెలిపి, ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సిబ్బందికి సూచించారు.