VIDEO: ఈపూరులో బైక్ దొంగల ముఠా అరెస్ట్
PLD: ఈపూరులో బైక్ దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం.. విలాసాల కోసం దొంగతనాలు చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి మొత్తం 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.18.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.