VIDEO: మంత్రి చొరవ.. నగరంలో అడవి బిడ్డల పర్యటన
HYD: మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీ మేరకు ఆదిలాబాద్ జిల్లా గోండుగూడెం గిరిజనులు హైదరాబాద్‌ను సందర్శించారు. 'ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్' ద్వారా ప్రభుత్వ ఖర్చులతో ఈ పర్యటన ఏర్పాటు చేశారు. గతంలో ఉట్నూరు పర్యటనలో గిరిజనుల కోరికను గుర్తించిన మంత్రి, తన మాట నిలబెట్టుకోవడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.