'మోగ్లీ' ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

'మోగ్లీ' ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ 'మోగ్లీ'. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. HYDలోని AMB సినిమాస్‌లో రేపు ఉదయం 10 గంటలకు ఇది విడుదల కానుంది. ఇక అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటించింది.