మెట్రోకు కేంద్ర ఆమోదం.. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ హర‍్షం
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు విశాఖ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగర రూపురేఖలు మారి, విశాఖ ప్రపంచ పటంలో కీలక నగరంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.