గుంటూరు పోలీసులకు డీజీపీ పతకాలు
గుంటూరు: జిల్లా పోలీసులకు డీజీపీ కమెండేషన్ డిస్క్‌లు దక్కాయి. 2025 సంవత్సరంలో వారు అందించిన ఉత్తమ సేవలకు గాను ఈ పతకాలు వరించాయి. జిల్లాకు చెందిన మొత్తం 22 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురికి సిల్వర్ డిస్క్, మరో 19 మందికి బ్రాంజ్ డిస్క్ దక్కాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఉత్తర్వులు జారీ చేశారు.