ఘనంగా వేమారెడ్డి మల్లమ్మ జయంతి

SRD: రాయికోడ్ మండలంలోని యూసుఫ్ పూర్ గ్రామంలో వేమారెడ్డి మల్లమ్మ జయంతిని శనివారం రెడ్డి సమాజ్ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు వేమారెడ్డి మల్లమ్మ చిత్రపటానికి పూజలు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఇందులో రాంరెడ్డి, సంతోష్ రెడ్డి, దత్తురెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.