కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతి
అన్నమయ్య: గరుగుపల్లి గ్రామంలోని ఇడుపులచేనుపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరుశనగ పంటను అడవి పందుల నుంచి రక్షించేందుకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రాణాంతకంగా మారాయి. పొలం వద్ద ఉన్న తండ్రికి అన్నం తీసుకెళ్తున్న సమయంలో పందికుంట సాయి కుమార్ రెడ్డి (19), ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థి, ఆ విద్యుత్ తీగలకు తగిలి మృతిచెందాడు.