నేడు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

నేడు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

పశ్చిమగోదావరి: తణుకులో నేడు మధ్యాహ్నం 3 గంటలకు మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు శేషగిరి తెలిపారు. తణుకు జాతీయ రహదారి సమీపంలోని సీఎం కన్వెన్షన్ హాల్లో సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు తప్పకుండా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.