పుట్టపర్తిలో 'శక్తి యాప్‌పై' అవగాహన కార్యక్రమం

పుట్టపర్తిలో 'శక్తి యాప్‌పై' అవగాహన కార్యక్రమం

SS: పుట్టపర్తి మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు, బాలికలకు పోలీసులు 'శక్తి యాప్'పై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వ్యక్తిగత ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కితే లేదా 112 నంబర్‌కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు సహాయం అందిస్తారని తెలిపారు.