గంగమ్మ ఆలయానికి భారీ విరాళం

గంగమ్మ ఆలయానికి భారీ విరాళం

CTR: కుప్పంలోని తిరుపతి గంగమాంబ ఆలయానికి భారీ విరాళం అందింది. బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీసీ నాగరాజ్ ఆదివారం రూ. 2.70 లక్షలు ఆలయ కమిటీ ఛైర్మన్ రవి చంద్రబాబుకు అందజేశారు. అనంతరం ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.