క్రీడా కోర్టులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

ELR: కాళ్ళ మండలం ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని క్రీడా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్, వాలీబాల్, కబడ్డీ కోర్టులను శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఇదే గ్రామంలో జూనియర్ కాలేజీను సందర్శించి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.