'వేతనదారులకు బకాయిలు చెల్లించాలి'

'వేతనదారులకు బకాయిలు చెల్లించాలి'

AKP: ఉపాధి హామీ పథకం వేతనదారులకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కోటవురట్ల మండలం రాజుపేట పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్నారు. 10 వారాల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.