రోడ్ల అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు

GNTR: కొల్లిపర మండలంలోని డొంక రోడ్ల అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరయ్యాయని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి తెలిపారు. కొల్లిపర మండల కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నాలుగు డొంక రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు.