'నేటి నుంచి మళ్లీ ఫీజు చెల్లించవచ్చు'

'నేటి నుంచి మళ్లీ ఫీజు చెల్లించవచ్చు'

NLR: జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు డీఈవో బాలాజీ రావు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీలోగా రూ.1000 ఆపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.