'గిరిజనుల ఆత్మబంధువు' పుస్తకాన్ని ఆవిష్కరించిన KTR
HYD: గిరిజనులకు మాజీ సీఎం KCR చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. BRS విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనునాయక్ రచించిన 'గిరిజనుల ఆత్మబంధువు' పుస్తకాన్ని KTR ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. KCR సేవలను తండాలలో, గూడాలలో గిరిజనజాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. KCR సేవలను పుస్తకరూపంలో తీసుకొచ్చిన శ్రీనును అభినందించారు.