సత్యదేవుని ఉత్సవాలకు ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఆహ్వానం
KKD: అన్నవరం రత్నగిరిపై వెలసిన సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవో చక్రధరరావు రాష్ట్ర ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరి జవహార్‌లాల్‌ను స్వయంగా కలిశారు. కళ్యాణ మహోత్సవాలకు విచ్చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు స్వీకరించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు .