నందిగామలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

నందిగామలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

కృష్ణా: నందిగామలో వక్ఫ్ ఆస్తుల సవరణ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ముస్లింలకు మత స్వేచ్ఛకు తూట్లు పొడుస్తూ ముస్లిం హక్కులను కాలరాస్తూ ప్రవేశపెట్టిన ఆస్తుల సవరణ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.