'ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది'

'ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది'

SKLM: దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాస్త్రీయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్.ఐ.సి. వీడియో కాన్ఫరెన్స్ హాల్‌‌లో 'భారత జనగణన-2027'కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.