డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే
ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ, స్పోర్ట్స్ డే వేడుకల్లో మంగళవారం MLA హరీష్ బాబు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడ రాణించాలన్నారు. రూ.3.4కోట్ల కేంద్ర నిధులతో అదనపు తరగతుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు. డిగ్రీ కళాశాలను రెసిడెన్షియల్ కళాశాలగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించమన్నారు.