రోడ్డు గుంతల మయం.. వాహనాదారులకు తప్పని తిప్పలు
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గం గుండా ఆసుపత్రికి వెళ్లే ప్రజలు, ముఖ్యంగా రాత్రి సమయంలో తీవ్ర కష్టాలు పడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రహదారిని వెంటనే మరమ్మత్తు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.