పీసీసీ సమావేశం.. ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

పీసీసీ సమావేశం.. ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

NLG: ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. నాంపల్లిలోని గాంధీభవన్‌లో జరిగే నేటి భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బహుశా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.