ఆకర్శిస్తున్న ఉల్లిపిట్ట జలపాతం అందాలు

ఆకర్శిస్తున్న ఉల్లిపిట్ట జలపాతం అందాలు

ASF: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో తిర్యాణి మండలంలోని ఉల్లిపిట్ట జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో సందర్శకులను జలపాతం విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం నిండుగా పారుతుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రకృతి, జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు.