'కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి'
ADB: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని నూతన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనను భీంపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, గోవర్ధన్, శ్రీనివాస్, భగువాండ్లు, విజయ్ కుమార్ తదితరులున్నారు.