ఇరాన్‌పైకి బి-52 బాంబర్‌ను పంపిన అమెరికా
ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమైంది. సుమారు 38 టన్నుల బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న బి-52 బాంబర్ విమానాన్ని రంగంలోకి దించింది. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. ఆదివారం ఉదయం టెహ్రాన్ విమానాశ్రయం సమీపంలో 20 నిమిషాల్లోనే 20 భారీ పేలుళ్లు సంభవించాయని స్థానికులు తెలిపారు. ఉద్రిక్తతలు మరింత ముదిరేలా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.