12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నసైకిల్ యాత్రికుడికి ఘన సత్కారం
NLG: మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని బోయపల్లి ప్రాంతానికి చెందిన మల్లేష్ గౌడ్ సైకిల్ యాత్ర ద్వారా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. యాత్రను ముగించుకుని ఆయన ఇటీవలే సొంత ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా BJP జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లేష్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.