నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎఈ స్వామి తెలిపారు. చెట్ల నరికివేత, విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.