భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ మెషిన్ గన్‌లు

భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ మెషిన్ గన్‌లు

భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ 2,000 ప్రహార్ 7.62 ఎంఎం లైట్‌ మెషిన్ గన్‌లను అందజేసింది. ఈ గన్‌ల డెలివరీతో మన దేశంలో తేలికపాటి మెషిన్‌ గన్‌లను దేశీయంగా తయారు చేసి సరఫరా చేసిన తొలి ప్రైవేటు రంగ సంస్థగా అదానీ డిఫెన్స్ నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న కంపెనీకి చెందిన చిన్న ఆయుధాల తయారీ కేంద్రంలో ఈ ఆయుధాలను తయారు చేశారు.