అన్నవరం ఆలయ ఈవోగా త్రినాథరావు బాధ్యతలు

అన్నవరం ఆలయ ఈవోగా త్రినాథరావు బాధ్యతలు

కోనసీమ: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయ ఈవోగా దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈవోగా పనిచేసిన వీర్ల సుబ్బారావును రెవిన్యూ శాఖకు సరెండర్ చేశారు. నూతన ఇంఛార్జ్ ఈవోగా త్రినాథరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.