అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలి: మంత్రి సురేఖ

అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలి: మంత్రి సురేఖ

WGL: దేవాదాయ శాఖకు మంత్రి కొండా సురేఖ శనివారం కీలక ఆదేశాలు జారీచేశారు. భారత గడ్డ మీద పర్యాటకులను చంపిన తీవ్రవాదులను ఏరివేత లక్ష్యంగా దేశ ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' విజయవంతం అయ్యేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో పూజలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతటి సంక్లిష్టమైన సమయంలో భారత ఆర్మీకి మనమంతా అండగా నిలవాల్సిన సందర్భం వచ్చిందన్నారు.