ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం: కార్పొరేటర్

ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం: కార్పొరేటర్

RR: మన్సురాబాద్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ కాలనీలో నిర్మించిన సంక్షేమ సంఘం భవనాన్ని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.60 లక్షలతో సంక్షేమ సంఘం భవనాన్ని నిర్మించడం జరిగిందని, ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరు సమాజ ప్రయోజనాల కోసం భవనాన్ని వినియోగించుకోవాలన్నారు.